Header Banner

యుద్ధం వస్తే దేశం విడిచి పారిపోయేందుకు పాక్ నేతలు రెడీ.. బీజేపీ నేత వ్యాఖ్యలు!

  Sun May 04, 2025 21:16        Politics

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మంత్రులు, ఆ దేశ ఆర్మీ జనరల్స్ భయంతో దేశం విడిచి పారిపోయేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారోనన్న భయాందోళనలు పాకిస్థాన్ నాయకత్వంలో వ్యక్తమవుతున్నాయని ప్రదీప్ భండారీ అన్నారు. ఈ భయంతోనే పలువురు పాక్ మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు తమ కుటుంబాలతో సహా ఇంగ్లాండ్ వంటి విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన వివరించారు. "యుద్ధం వస్తే తాము ఇంగ్లాండ్ వెళతామని కొందరు పాక్ నేతలు ఇప్పటికే చెబుతున్నారు" అని భండారీ పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యంపై గానీ, వారి రక్షణ సామర్థ్యంపైన గానీ ఆ దేశ ప్రజలకే నమ్మకం లేదని భండారీ ఎద్దేవా చేశారు. అందుకే మంత్రులు, కీలక నేతలు ముందుజాగ్రత్తగా విదేశాలకు పయనమయ్యేందుకు టిక్కెట్లు సిద్ధం చేసుకున్నారని ఎత్తిపొడిచారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్... పాకిస్థాన్‌కు తగిన రీతిలో గట్టి సమాధానం ఇవ్వనుందని భండారీ తెలిపారు. ప్రపంచంలోని ప్రతీ దేశం, ప్రధాని మోడీ తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ చర్యలకు పాకిస్థాన్ నాయకత్వం భయపడుతోందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices